Home

»

Latest News

ఆ విషయంపై నాది ఓపెన్ మైండ్.. ఫ్యాన్స్ ఎలా అయినా తీసుకోవచ్చు

Aug 1, 2026 4:41PM

 

అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran)పేరుకే మలయాళ ముద్దుగుమ్మ. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో తమ హీరోయిన్ గా ఓన్ చేసుకున్నారు.  ఆ మాట కొస్తే తను ఏ లాంగ్వేజ్ లో చేస్తే ఆ లాంగ్వేజ్ ప్రేక్షకులు అనుపమ తన నటి అని చెప్పేస్తారు. దీన్ని బట్టి అనుపమ స్టామినా అర్ధం చేసుకోవచ్చు.

అనుపమ అప్ కమింగ్ మూవీ క్రేజీ కళ్యాణం. రీసెంట్ గా ‘క్రేజీ కల్యాణం’ఈవెంట్‌లో పాల్గొన్న అనుపమ మాట్లాడుతు 'ఒక నటిగా ప్రతీ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతోనే కష్టపడతాం. కానీ ప్రీవియస్ మూవీ  'పరదా' ఫలితం నన్ను ఎంతగానో బాధించింది. ఆ సమయంలో నేను తీవ్రమైన బ్యాడ్ ఫేజ్ (కష్టకాలాన్ని) అనుభవించాను. ఒక మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాను తన భుజస్కంధాలపై మోసి, ముందుకు తీసుకెళ్లడం ఎంతటి భారమో నాకు ఆ సమయంలో అర్థమైంది.


Also read: నా డ్రీం హీరో అతనే.. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ వ్యాఖ్యలు వైరల్ 


ఒకే ఏడాదిలో దాదాపు 6 సినిమాల్లో నటిస్తూ నటిగా కెరీర్‌లో అత్యంత రద్దీగా గడిపినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాకపోవడం డిప్రెషన్‌కి గురిచేసింది. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోను  బ్రేకప్ రూమర్లు, సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారాలు మరింత కుంగదీశాయి. నా లైఫ్ ఇకపై ఎవరి కంట్రోల్‌లో  ఉండదు, నా నిర్ణయాలు నావే. అయినప్పటికీ ఓటమిని చూసి భయపడి వెనకడుగు వేయను. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, అది నేర్పే పాఠాలు చాలా గొప్పవి. ప్రతి ప్లాప్ ఒక కొత్త గుణపాఠం. విజయం మనకు ఉత్సాహాన్ని ఇస్తే, ఓటమి కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. రాబోయే రోజుల్లో వైవిధ్యమైన, సరైన కథలను ఎంచుకుని మళ్లీ బలంగా పుంజుకుంటాను అని ధైర్యంగా ప్రకటించారు. 

Anupama parameswaran, Crazy Kalyanam, Tollywood
  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com