రామజోగయ్యను సంతోషపెట్టిన ఎన్టీఆర్..
on Aug 12, 2016
.jpg)
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్లో వస్తోన్న జనతా గ్యారేజ్ ఆడియో లాంచ్ వేడుక హైదరాబాద్ శిల్పకళావేదికలో అట్టహాసంగా జరుగుతోంది. చాలా మంది ప్రముఖులు ఆడియో వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో నేను చూసిన గొప్ప మ్యూజిక్ లవర్ జూనియరే అన్నారు. స్వయంగా నేను రాసి ఆయన వద్ద పాడి వినిపించిన పాటలు నాకే గుర్తుండవు..కానీ ఎన్టీఆర్‌కి మాత్రం ప్రతి పదం గుర్తే. లోకేషన్‌లో ఆ పాటలు పాడి నన్ను సంతోషపరుస్తూ ఉండేవారు ఎన్టీఆర్. ఆయనకి జ్ఞాపకశక్తి ఎక్కువ అని అందరూ చెబుతుంటే వినడమే...ఇప్పుడు వాళ్లంతా ఎన్టీఆర్‌ను ఎందుకు పొగుడుతున్నారో అర్థమయ్యింది అని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



