సమంతకు స్వల్ప అస్వస్థత..గ్యారేజ్ ఫంక్షన్ మిస్
on Aug 12, 2016

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్‌లో వస్తోన్న జనతా గ్యారేజ్ ఆడియో వేడుక కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. శిల్పకళావేదిక వద్దకు అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా అతిథులంతా ఆడిటోరియం వద్దకు చేరుకుంటున్నారు. ఎంతమంది వచ్చినా అందరి కళ్లూ హీరో, హీరోయిన్ల మీదే కదా..! తమ అభిమాన తారలను ఎప్పుడెప్పుడు చుద్దామా అని అభిమానులంతా ఎదురుచూస్తుండగా..ఈ సినిమా హీరో హీరోయిన్లలో ఒకరైన సమంతా పిడుగులాంటి వార్తను ట్వీట్ చేసింది. ఒంట్లో కాస్త నలతగా ఉన్న కారణంగా ఈ ఆడియో వేడుక కార్యక్రమానికి హాజరుకావట్లేదని..అందరిని మిస్ అవుతున్నందుకు బాధగా ఉందని ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



