అమ్మకానికి వచ్చిన ఎన్టీఆర్ బుల్లెట్..!
on Aug 12, 2016

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్‌లో వస్తోన్న సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ దగ్గర నుంచి మేకింగ్ వీడియో వరకు అభిమానులను ఆకర్షిస్తున్న విషయం ఎన్టీఆర్ వాడిన బైక్. అప్పుడే చాలా మంది ఫ్యాన్స్ కన్ను ఆ బుల్లెట్‌పై పడింది. అలాంటి వారి కోసం ఆ చిత్ర యూనిట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక ఛారిటీ కార్యక్రమానికి నిధుల సేకరణలో భాగంగా ఎన్టీఆర్ వాడిన జనతా గ్యారేజ్ బైక్‌ను వేలం వేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీని ద్వారా సమకూరిని మొత్తాన్ని ఛారిటికి అందజేస్తామని చెప్పారు. ఈ బైక్ మీ సొంతం కావాలంటే.."డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. జనతా గ్యారేజ్.కామ్" వెబ్‌సైట్‌లోకి వెళ్లి..వెయ్యి రూపాయలు చెల్లించి రిజస్టర్ అవ్వాలి. అనంతరం వేలం ద్వారా బుల్లెట్ మీ సొంతమవుతుంది. విజేతకు దీనిని స్వయంగా ఎన్టీఆర్ చేతుల మీదుగా అందజేస్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



