ఎన్టీఆర్ గ్యారేజ్‌లో ఫ్యాన్స్ హంగామా..
on Aug 12, 2016
.jpg)
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం జనతా గ్యారేజ్(ఇక్కడ అన్నిరకాల రిపేర్లు చేయబడును). మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్‌కు, వరుస బ్లాక్‌బస్టర్‌లతో దూసుకొస్తోన్న కొరటాల శివ జతకలవడంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఇవాళ ఆడియో లాంఛ్‌కి ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. దేవిశ్రీప్రసాద్ మాంచి మ్యూజిక్ కంపోజ్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అభిమానులు ఫంక్షన్ జరిగే శిల్పకళావేదిక వద్ద బారులు తీరారు. పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు ఒక చోటికి చేరడంతో పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో పాస్‌లు జారీ చేయడంతో..రోడ్ల మీద చాలా మంది నిలిచిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



