ఇంకెప్పుడు రిలీజ్.. కొత్త చిక్కుల్లో జన నాయగన్
on Jan 27, 2026

-తీవ్ర నిరాశలో విజయ్ ఫ్యాన్స్
-రిలీజ్ ఇప్పట్లో లేనట్లేనా!
-రీసెంట్ గా వచ్చిన సమస్య ఏంటి!
ఇళయ దళపతి విజయ్(Vijay)వన్ మాన్ షో జన నాయగన్(Jana Nayagan)కి ఎవరి దిష్టి తలిగిందేమో గాని, అన్ని అడ్డంకులు తొలిగిపోయి థియేటర్స్ లో ల్యాండ్ అవుతుందనుకుంటే మళ్ళీ కొత్త ఆటంకం ఎదురవుతుంది. దీంతో అభిమానులు, మూవీ లవర్స్ చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఇప్పటికీ తమిళనాడు వ్యాప్తంగా చాలా మంది అభిమానులు షో ఏమైనా ప్రదర్శిస్తారేమో అని థియేటర్స్ వద్దకు వెళ్తున్నారు. విజయ్ కట్ ఔట్స్ తో వాళ్ళు ముస్తాబు చేసిన థియేటర్స్ నే అందుకు సాక్ష్యం. ఈ క్రమంలో మరో న్యూస్ వాళ్ళల్లో మరింత నిరుత్సాహాన్ని రేపుతుంది.
జననాయగన్ కి U/A సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తు సెన్సార్ బోర్డ్ హైకోర్టుకి వెళ్లిన విషయం తెలిసిందే. రీసెంట్ గా సదరు కేసుపై హైకోర్టు స్పందిస్తు సెన్సార్ బోర్డుకి తమ వాదనలు వినిపించుకునే అవకాశం సింగల్ బెంచ్ ఇవ్వలేదు. న్యాయపరమైన అవకాశాలని పేర్కొంటూ కేసుని మళ్లీ విచారణ జరపాలి. అలాగే, ఈ వ్యవహారాన్ని రివైజింగ్ కమిటీకి పంపిన నిర్ణయం సరైనదా కాదా అనే అంశాన్ని సింగిల్ జడ్జి స్వేచ్ఛగా పరిశీలించవచ్చు. ఈ విషయంలో మరోసారి విచారణ చేసి ఆదేశాలు జారీ చేసే అధికారం సింగిల్ బెంచ్ కి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మూవీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
also read: ఇరుముడి పై అప్పుడే రూమర్స్.. పోస్టర్ లో పాప ఉంటే ఆ సినిమా రీమేక్ నా!
జన నాయగన్ లోని కొన్ని సన్నివేశాలతో పాటు చాలా డైలాగ్స్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులని ప్రభావితం చేసేలా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ భావించి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడమే వల్లే పైన చెప్పుకున్న తతంగం మొత్తం జరుగుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



