అనసూయ కి గుడి కడతానంటున్న ప్రముఖ పూజారి.. ఓకే అంటుందా!
on Jan 27, 2026

-అనుకున్నట్టే పూజారి గుడి కడతాడా!
-అనసూయ నిర్ణయం ఎలా ఉండబోతుంది
-ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా!
-ఇంతకీ గుడి ఎక్కడ
షార్ట్ పీరియడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ని సంపాదించిన నటి అనసూయ(Anasuya). కొంత మంది డైరెక్టర్స్ అయితే అనసూయ కోసమే క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తున్నారు. అంతలా తన క్యారెక్టర్స్ లోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలదు. దీంతో భారీ అభిమాన గణం ఆమె సొంతమయ్యింది. సదరు అభిమాన గణం రేంజ్ ఏ స్థాయిలో ఉందో సోషల్ మీడియాలో ఉన్న ఆమె ఫాలోవర్స్ ని చూసి తెలుసుకోవచ్చు. రీసెంట్ గా అనసూయ గురించి ఒక అభిమాని చెప్తున్న మాటలు ఇప్పుడు వైరల్ గా నిలుస్తున్నాయి. మరి వైరల్ గా మారడానికి సదరు అభిమాని ఏం చెప్పాడో చూద్దాం.
అనసూయ అభిమాని పూజారి మాట్లాడుతు 'అనసూయ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతలా అంటే మాటల్లో చెప్పలేనిది. అపారమైన గౌరవం కూడా. అనసూయ పర్మిషన్ ఇస్తే ఆమె విగ్రహంతో గుడి కడతాను. అప్పట్లో తమిళనాడులో హీరోయిన్ ఖుష్బూకి గుడి కట్టినట్టే అనసూయకి కడతాను. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, అనసూయ అనుమతి తీసుకుంటాం. ఆమె అంగీకరిస్తే వెంటనే గుడి పనులు ప్రారంభిస్తానని కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా నిలవడంతో అనసూయ రియాక్షన్ కోసం అందరు ఎదురుచూస్తున్నారు.
Also ready: ఇంకెప్పుడు రిలీజ్.. కొత్త చిక్కుల్లో జన నాయగన్
తమకి నచ్చిన సినీ భామలకి గుడి కట్టడం అనేది తమిళనాట స్టార్ట్ అయ్యింది.ఖుష్భు, హన్సిక, నమిత లాంటి వాళ్లని విపరీతంగా అభిమానించిన తమిళ అభిమానులు, సదరు హీరోయిన్స్ కి గుడి కట్టారు. ఇప్పుడు తెలుగు నాట అనసూయకి గుడి కడితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి నటిగా అనసూయ రికార్డు కొట్టినట్లే. మరి అనసూయ ఆ రికార్డుని సాధిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా గుడి మాటర్ వైరల్ కావడంతో, ఏ ఏరియా లో ఉండబోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



