ఇరుముడి పై అప్పుడే రూమర్స్.. పోస్టర్ లో పాప ఉంటే ఆ సినిమా రీమేక్ నా!
on Jan 27, 2026

-రవితేజ ఫ్యాన్స్ హంగామ
-ఇరుముడి కి ఆ సినిమాకి సంబంధం ఏంటి!
-ఇంతకీ ఆ సినిమా ఏంటి!
నిన్న ఇండియా వ్యాప్తంగా రిపబ్లిక్ వేడుకల్ని అందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. మాస్ మహారాజా రవితేజ(Raviteja)అభిమానులు అయితే రిపబ్లిక్ వేడుకలతో పాటు,రవితేజ బర్త్ డే వేడుకల్ని కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆ ఉత్సాహానికి మరింత కిక్ ని ఇచ్చేలా రవితేజ తన కొత్త చిత్రం ఇరుముడి(irumudi)ని అనౌన్స్ చేయడంతో పాటు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఇరుముడి ధరించి పాపని ఎత్తుకొని ఉన్న మాస్ మహారాజ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ పోస్టర్ కి సంబంధించిన రికార్డు వ్యూస్ లన్నింటికి సెండ్ ఆఫ్ చెప్పి కొత్త రికార్డుల అన్వేషణలో ఉంది. దీంతో అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. ఎప్పడెప్పుడు మూవీ కంప్లీట్ చేసుకొని తమ ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మూవీ లవర్స్, ప్రేక్షకులది కూడా ఇదే పరిస్థితి. మరి ఫస్ట్ లుక్ తోనే ట్రెండింగ్ లో నిలిచిన ఇరుముడి కి సంబంధించి వినిపిస్తున్న న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
మలయాళ సూపర్ హిట్ మూవీ మాలికాపురం(Malikappuram)కి రీమేక్ గా ఇరుముడి తెరకెక్కుతోందనే ప్రచారం సినీ సర్కిల్స్, సోషల్ మీడియాలో జోరుగానే జరుగుతుంది. 2022 వ సంవత్సరంలో 'ఉన్ని ముకుందన్' హీరోగా తెరకెక్కిన 'మాలికాపురం' కథ, కథనాలు అయ్యప్ప భక్తులతో పాటు ప్రతి ఒక్కరి హృదయాల్ని గెలుచుకునేలా ఉండటంతో సంచలన విజయాన్ని అందుకుంది. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా 100 కోట్ల రాబట్టడమే విజయం తాలూకు రేంజ్ కి ఉదాహరణ. తెలుగులోకి కూడా డబ్ అయిన మాలికాపురం కథ విషయానికి వస్తే కళ్యాణి అనే ఎనిమిదేళ్ల చిన్నారి అయ్యప్పస్వామి భక్తురాలు. తండ్రితో కలిసి శబరిమల వెళ్లాలన్నది ఆమె కల. కానీ అనుకోని పరిస్థితుల్లో తండ్రి చనిపోతాడు.
దీంతో ఒక స్నేహితుడితో కలిసి శబరిమల ప్రయాణం మొదలుపెడుతుంది. ఆ ప్రయాణంలో ఆమె అవాంతరాలని ఎదుర్కొంటుంది. చివరికి అయ్యప్పన్ అనే వ్యక్తి సహాయంతో శబరిమల చేరుకుంటుంది. అసలు అయ్యప్పన్ ఎవరు? ఆయన నిజంగా దేవుడేనా? అనే ఆధ్యాత్మిక ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. నిన్న రిలీజ్ చేసిన ఇరుముడి పోస్టర్ లో పాప ఉండటం మాలికాపురం కి దగ్గరలో ఉంది.
కాబట్టి మాలికాపురం కి రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే మాలికా పురం కి రీమేక్ నా లేక ఇన్ స్పిరేషన్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నారా అనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది. చిత్ర బృందం అయితే రీమేక్ వార్తలపై స్పందించిన దాఖలాలు లేవు. రవితేజ అభిమానులు మాత్రం రెండు సినిమాల్లో పాప ఉంటే ఒకే కథలు అవుతాయా! ఏది ఏమైనా ఇరుముడి సూపర్ హిట్ కాబోతుంది. రవితేజ కెరీర్ లోనే పెద్ద హిట్ కాబోతుందని సోషల్ మీడియా వేదికగా అప్పుడే హంగామా మొదలుపెట్టారు.
Also read: క్యాస్టింగ్ కౌచ్ వివాదం.. చిరంజీవి పై చిన్మయి సంచలన వ్యాఖ్యలు
ఇటీవల వచ్చిన భర్త మహాశయులకు విజ్నప్తి రవితేజ 76 వ చిత్రం కాగా ఇరుముడి 77 వ చిత్రం. నిన్ను చూడాలని, మజిలీ వంటి హిట్ చిత్రాల మేకర్స్ శివ నిర్వాణ(Shiva Nirvana)దర్శకుడు. శివ నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీ విజయ్ దేవరకొండ, సమంత ల ఖుషి. ఖుషి ని నిర్మించిన మైత్రి మూవీస్ నే ఇరుముడి ని నిర్మిస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



