చెంబు సుకుమార్‌కి..బకెట్ కొరటాలకి
on Sep 10, 2017
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు పరిపూర్ణమైన నటుడిగా పేరుంది. పాత్ర ఏదైనా సరే దానిని అద్భుతంగా రక్తి కట్టించగల సత్తా ఎన్టీఆర్ సొంతం. ఆ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయ్యింది..ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలంతా సందర్భం వచ్చినప్పుడల్లా ఎన్నో వేదికలపై జూనియర్ నటనను మెచ్చుకుంటూనే ఉన్నారు. తాజాగా సుకుమార్ ఆ లిస్ట్‌లో చేరాడు.. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జైలవకుశ ఫ్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన సుకుమార్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఓ నట సముద్రమని..ఆ సముద్రంలో నుంచి ఒక చెంబు నీళ్లని తాను, ఓ బకెట్ నీళ్లని కొరటాల శివ తీసుకున్నారని..కానీ బాబీ మాత్రం ఏకంగా ఓ ట్యాంకర్ నీళ్లని పట్టుకుపోయారని ఆయన అన్నారు. ఆ వెంటనే జై ఎన్టీఆర్..జై ఎన్టీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది.