ట్రైలర్ రివ్యూ: జైలవకుశ
on Sep 10, 2017
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి వరుస బ్లాక్ బస్టర్‌లతో దూసుకెళుతున్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో "జైలవకుశ" అనే సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే ఫస్ట్ టైం ఒకే సినిమాలో మూడు పాత్రలు చేయడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. దానికితోడు ఇప్పటికే రిలీజ్ చేసిన జై, లవ, కుశ టీజర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఫ్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 2 నిమిషాల 11 సెకన్ల నిడివితో గల ఈ ట్రైలర్‌లో అన్ని పాత్రలను కట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా ఒదిగిపోయాడు..ముఖ్యంగా జై క్యారెక్టర్ చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. హీరోయిన్లు రాశిఖన్నా, నివేధా థామస్ అందాలతో కనువిందు చేశారు..ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తోన్న ఈ మూవీని సెప్టెంబర్ 21న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.