ప్రారంభమైన జై లవకుశ ఫ్రీ-రిలీజ్ ఫంక్షన్
on Sep 10, 2017
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జైలవకుశ ఫ్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ శిల్పకళావేదికలో జరుగుతోంది. రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన నందమూరి అభిమానుల కోలాహలంతో వేదిక ప్రాంగణంతో సందడిగా మారింది. వేడుకలో పాల్గొనేందుకు హీరోయిన్ రాశిఖన్నా, దర్శకులు సుకుమార్, కొరటాల శిక తదితరులు అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం హీరో జూనియర్ ఎన్టీఆర్, నిర్మాత కళ్యాణ్ రామ్, నందమూరి హరికృష్ణ శిల్పకళావేదిక వద్దకు చేరుకోవడంతో అభిమానులు జై ఎన్టీఆర్..జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు.