ఎన్టీఆర్ దాచిన ఆ ఇద్దరు ఎవరు..?
on Sep 11, 2017
హ్యాట్రిక్ విజయాలు కొట్టి మంచి ఊపులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేయాలో తేల్చుకోలేకపోయాడు..ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ కొట్టిన జూనియర్ ఆ తరువాత అదే జోరును కంటిన్యూ చేసే కథ కోసం ఎదురుచూశాడు. తన తోటి హీరోలంతా వన్ బై వన్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళుతుంటే ఎన్టీఆర్ మాత్రం ఏ కథను ఎంచుకోవాలో తెలియక చాలా రోజుల పాటు ఖాళీగా ఉండిపోయాడు..చాలా మంది దర్శకులతో చర్చలు జరిపిన తర్వాత బాబీ చెప్పిన కథ నచ్చడంతో దానికి పచ్చ జెండా ఊపాడు. అయితే అది కూడా అంత సులభంగా ఎంపిక చేయలేదు..ఈ సినిమా నీ జీవితంలో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని..ఖచ్చితంగా కథకు ఓకే చెప్పాలని ఇద్దరు సన్నిహితులు చెప్పారట. ఈ ఇద్దరి మాట మన్నించిన ఎన్టీఆర్ వెంటనే మరో మాట లేకుండా సినిమాను పట్టాలెక్కించాడట. జైలవకుశ ఫ్రీ-రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా యంగ్‌టైగర్ ఈ సంగతి చెప్పాడు. కానీ వారు ఎవరు అనేది ఇప్పుడే చెప్పనని..సినిమా హిట్ అయిన తర్వాతే వాళ్ల పేర్లు చెబుతానని జూనియర్ అభిమానులతో అన్నాడు..ఆ ఇద్దరు ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read