‘బిగ్ బాస్’లో దీక్ష తింగర చేష్టలు.. ఆమెను తలపిస్తున్నాయ్!
on Sep 11, 2017
తింగర తనం కూడా ఒక్కోసారి కలిసొస్తుందండోయ్... ! ‘బిగ్ బాస్ హౌజ్’ లో దీక్షను చూడండి.. అది ఎంత నిజమో అర్థమవుతుంది. బిత్తర బిత్తర చూపులు... వంకర టింకర సమాధానాలు.. అనవసరంగా అలగడాలూ.. అప్పుడప్పుడు అర్థంలేని అహంకారం కూడా ప్రదర్శించడాలూ.. అబ్బో... నిజంగా ‘బిగ్ బాస్’ హౌజ్ లో దీక్ష.. స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందనే చెప్పాలి. నిజానికి ఈ అమ్మాయ్ మధ్యలో వచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు కదా. అలా అన్నమాట. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా అందర్నీ ఎంటర్టైన్ చేస్తోంది దీక్ష. అయితే... దీక్ష వల్ల జనాలు ఎంటర్టైన్ అవుతోంది.. ఆమె ప్రతిభ వల్ల కాదు.. తింగర యాటిడ్యూడ్ వల్ల. బహుశా... జనాలకు అదే నచ్చినట్టుంది. అందుకే... ఒక్కోసారి తింగరతనం కూడా కలిసొస్తుందన్నది. బాలీవుడ్ లో అలియా భట్ ఉంది కదా! ఆ అమ్మాయ్ కూడా ఇంతే. ఏం మాట్లాడినా వంకర టింకర గానే ఉంటుంది. చేతలు కూడా గమ్మత్తుగా అనిపిస్తాయ్. అందుకే... సోషల్ మీడియాలో అలియా పై వచ్చినన్ని కామెంట్లు బాలీవుడ్ లో ఏ హీరోయిన్ పై రావు. అలియా అంటే చాలు.. సోషల్ మీడియాలో ఆడేసుకుంటుంటారు పాపం. ఇప్పుడు ‘బిగ్ బాస్’ పుణ్యమా అని... టాలీవుడ్ అలియాభట్ గా అవతరించింది దీక్ష. స్టార్ డమ్ లో కాదు లేండీ. సోషల్ మీడియాలో అలియా లాగా హాట్ టాపిక్ అవుతోంది కదా. అలా అనమాట. మరి ఈ ఎంటర్ టైన్మెంట్ ఎన్నాళ్లుంటుందో చూడాలి. ఈ వారం ప్రిన్స్ ని పంపించేశారు. ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నవారికి ఓ విషయం అర్థమైవుంటుంది. ఓ వారం అమ్మాయ్ అయితే.. రెండో వారం అబ్బాయ్. అలా పంపిస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే... తర్వాత వెళ్లిపోయేది అమ్మాయే. ఆ లిస్ట్ లో ఎవరుంటారో మరి.