ఒక అన్నకి తమ్ముడిచ్చిన మాటే..జైలవకుశ..?
on Sep 10, 2017
తన సినీ ప్రయాణంలోనే తొలిసారిగా ఒకే సినిమాలో మూడు రకాల పాత్రల్లో నటిస్తున్నాడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. మూడు సూపర్‌హిట్ల తర్వాత ఏ సినిమా చేయాలా..? ఎవరితో చేయాలా అన్న డైలామాలో ఉన్న ఎన్టీఆర్ ఎవ్వరూ ఊహించని విధంగా బాబీ చెప్పిన కథను ఫైనల్ చేశాడు. అదే జైలవకుశ చిత్రం..అయితే దీనిని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్‌రామ్ సొంత బ్యానర్‌లో నిర్మించడం టాలీవుడ్‌తో పాటు అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించడానికి కారణం ఎవరో తెలుసా..? దివంగత నందమూరి జానకీ రామ్. జైలవకుశ ఫ్రీ-రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా హరికృష్ణ ఈ విషయం చెప్పారు. ఓ రోజు జానకీరామ్ బాబు..కళ్యాణ్‌రామ్ బాబుతో..ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పెట్టుకోవడం కాదు..ఈ బ్యానర్ మీద తమ్ముడితో సినిమా తీయాలని అని అన్నాడు..అప్పుడే జైలవకుశకు బీజం పడిందన్నారు..ఈ సినిమాలో జై పాత్ర తనకు బాగా నచ్చిందని..జై పాత్రలో ఎన్టీఆర్ బాబు నవ్వుతుంటే..నాడు సీతారామ కళ్యాణంలో అన్నగారి నవ్వు గుర్తుకు వస్తోందని అన్నారు.