మోడ్రన్ లుక్‌లో అదిరిపోతున్న "కుశ"
on Aug 25, 2017
.jpg)
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. బాబీ దర్శకత్వంలో తాను నటిస్తోన్న జై లవ కుశ సినిమా సంబంధించి కుశ ఫస్ట్‌లుక్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. తొలుత తన అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన ఆయన కొద్ది క్షణాల్లోనే చిన్న సర్‌ప్రైజ్ ఇస్తానని పేర్కొన్నారు. ఆ వెంటనే తర్వాతి ట్వీట్‌లో కుశ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసి నిజంగానే సర్‌ప్రైజ్ చేశారు. ఈ లుక్‌లో ఎన్టీఆర్ ట్రెండీగా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో యంగ్‌టైగర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ నెల చివర్లో కుశ టీజర్‌ను కూడా రిలీజ్ చేసి సెప్టెంబర్ 3న అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్‌ను నిర్వహించి..సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



