లవకుమార్.. లవ్లీగా ఉన్నాడు
on Aug 24, 2017

తాతగారి లక్షణాలన్నీ పుణికిపుచ్చేసుకున్నాడబ్బా తారక్ మాత్రం. అప్పట్లో పెద్దాయన కూడా అంతే కదా!... ఏ పాత్ర చేస్తే... ఆ పాత్రగా మారిపోయేవారు. ఇప్పుడు ఈ చిన్నోడు కూడా అంతే... ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఇమిడిపోతున్నాడు. అందుకే... వీరిద్దరూ నీళ్లలాంటివారు. ఏమంటారు?
ప్రస్తుతం తారక్ ‘జై లవకుశ’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే కదా!. ఇందులో తారక్... ‘జై’గా, ‘లవకుమార్’గా, ‘కుశకుమార్’గా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మొన్నామధ్య ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజైనప్పుడు అందులో‘జై’ కేరక్టరైజేషన్ చూసి ‘వామ్మో... ఇంత విలనీనా?’ అని అందరూ షాక్ అయ్యారు. కొందరైతే... పెద్దాయన చేసిన నెగిటీవ్ రోల్స్ గుర్తొచ్చాయని తెగ పొగిడేశారు. ఈ గురువారం... ‘లవకుమార్’ కేరక్టరైజేషన్ని పరిచయం చేస్తూ ఇంకో టీజర్ ని విడుదల చేశారు. అసలు లవకుమార్ గా ఎన్టీయార్ ఎంత క్యూట్ గా ఉన్నాడనుకుంటున్నారు! అమాయకంగా, మంచితనానికి మరో పేరుగా కనిపిస్తున్నాడు తారక్. అసలు ‘జై’కీ... ఈ ‘లవకుమార్’కీ పొంతనే లేదంటే నమ్మండి! తారక్ మంచి నటుడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?
లవకుమార్ ఓ ప్రైవేటు బ్యాంక్ మేనేజర్. మంచికి మారుపేరు. తన కింద పనిచేసేవారికి కూడా గౌరవం ఇచ్చేంత సంస్కారవంతుడు. కానీ... తను ఏదో సమస్యను ఎదుర్కొంటున్నాడు. ‘మంచి తనం పుస్తకంలో ఉంటే పాఠం అవుతుంది. మనలో ఉంటే గుణపాఠం అవుతుంది’ అంటూ.. లవకుమార్ చెబుతున్న డైలాగ్ తో ఈ టీజర్ పూర్తవుతుంది. ఏది ఏమైనా... సినిమాలో మాత్రం ఏదో విషయం ఉన్నట్టే ఉంది. ఇక ‘కుశకుమార్’ ఎంట్రీనే మిగిలింది. ఏ.ఎస్.రవీంద్ర(బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



