తమన్నా స్పెషల్ సాంగ్ పూర్తి... అక్టోబర్ 6న రిలీజ్
on Sep 24, 2016
.jpg)
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్, ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్'. హెచ్.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జాగ్వార్`. స్టార్ కాస్ట్ అండ్ క్రూ, 75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో భారీసెట్‌లో హీరో నిఖిల్‌కుమార్, మిల్కీబ్యూటీ తమన్నాలపై ఈ స్పెషల్‌సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ స్పెషల్ సాంగ్ సినిమాలో మరో హైలైట్‌గా నిలవనుంది. ఈ సాంగ్‌ను చిత్రీకరించడంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్ 6న వరల్డ్‌వైడ్‌గా 'జాగ్వార్' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



