హీరోని పెళ్లి చేసుకున్న యాంకర్ లాస్య...?
on Sep 23, 2016

సహజమైన అభినయంతో, అమాయకత్వంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది యంగ్ యాంకర్ లాస్య. ఇదంతా పక్కన బెడితే ముఖ్యంగా తన కో-యాంకర్ రవితో కలిసి చేసే రచ్చతో ఈ అమ్మడు ఫుల్ ఫేమస్. వీరిద్దరి మధ్య ఏదో యవ్వారం నడుస్తోందంటూ రూమర్స్ కూడా వచ్చాయి. అయితే అందరికి షాకిస్తూ లాస్య ఓ యువహీరోని పెళ్లిచేసుకుందన్న వార్త ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌తో పాటు మీడియా సర్కిల్స్‌లోనూ సంచలనం కలిగిస్తోంది. ఆ యువహీరో ఎవరో కాదు రాజ్‌తరుణ్..అస్సలు నోటి వెంట మాట రావడం లేదు కదూ..? అందరికి అలాగే ఉంది. ఇటీవల లాస్య, రాజ్‌తరుణ్ క్లోజ్‌గా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లాస్య, రాజ్‌తరుణ్ ప్రేమలో ఉన్నారని..విషయం ఇరు కుటుంబాల వరకు వెళ్లిందని..వారు ఒప్పుకోకపోవడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. మరి వీరి పెళ్లి వార్తలో నిజం తెలియాలంటే, ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



