'హైపర్' థియేట్రికల్ ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్
on Sep 24, 2016

ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్‌వాస్ కాంబినేషన్‌లో వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హైపర్' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలై ఆడియెన్స్ నుండి ట్రెమండస్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఈ సందర్భంగా....నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ - `` జిబ్రాన్ సంగీతం అందించిన పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే థియేట్రికల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ 30న దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



