జాగ్వార్ ఫస్ట్ టికెట్ రూ.10 లక్షలు..!
on Sep 27, 2016

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, హెచ్‌డీ.కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా తెరకెక్కిన జాగ్వార్ చిత్రంపై సౌత్‌లో భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో విడుదలకానున్న జాగ్వార్ టికెట్ల కోసం ఇప్పటికే విపరీతమైన పోటీ నెలకొంది. టికెట్ల కోసం చిత్ర యూనిట్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో అభిమానులు పోటి పడ్డారు. మైసూరుకు చెందిన లోకేశ్ అనే వ్యక్తి అత్యధికంగా రూ.10 లక్షలకు జాగ్వార్ సినిమా ఫస్ట్ టికెట్‌ను సొంతం చేసుకున్నట్టు సమాచారం. చిత్ర విడుదల రోజున ఆ వ్యక్తి పేరును వెల్లడించనున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుమారు 16 దేశాల్లో వెయ్యికి పైగా స్క్రీన్లలో విడుదలకానుంది. మాజీ ముఖ్యమంత్రి తనయుడు కావడం, భారీ ప్రమోషన్ కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



