పవన్, కమల్‌ల మధ్య నలుగుతున్న శృతి
on Sep 26, 2016

సినీ పరిశ్రమ భలే విచిత్రమైంది. అవకాశాల కోసం ఎదురు చూసేవారు కొందరు..అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేని వారు మరికొందరు..అవకాశాన్ని చేజిక్కించుకున్నా డేట్స్ సర్దుబాటు చేయలేనివారు ఇంకొందరు. అచ్చం ఇలాంటి పరిస్థితిలోనే ఉంది కమల్ హాసన్ గారాలపట్టి శృతిహాసన్. వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నా డేట్స్ సర్దుబాటు చేయలేక సతమతమవుతోంది. ప్రస్తుతం పవన్ "కాటమరాయుడు"లోనూ..తన తండ్రి కమల్ హాసన్ నటిస్తున్న "శభాష్ నాయుడు" సినిమాలోనూ శృతి నటిస్తోంది. అయితే కాటమరాయుడు షూటింగ్ ఈరోజు వరకు స్టార్ట్ కాలేదు. అలాగే కమల్‌కు గాయం కావడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో శృతి కొంతకాలం నుంచి ఖాళీగానే ఉంటోంది. ఇటు ఈ రెండు సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియక..అటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేక శృతి నలిగిపోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



