మహేశ్ చేతుల మీదుగా నందిని నర్సింగ్ హోమ్
on Sep 27, 2016

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో వారసుల అరంగేట్రాలు మళ్లీ ఊపందుకున్నాయి. మొన్న నిర్మలా కాన్వెంట్‌తో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఎంట్రీ ఇవ్వగా..తాజాగా సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అతను నటించిన నందిని నర్సింగ్ హోమ్( ఇక్కడ అందరు క్షేమం). పి.వి.గిరి దర్శకత్వం వహిస్తుండగా..నిత్య కథానాయికగా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇవాళ ఆడియో లాంచ్ జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు హాజరవుతున్నాడు. ఆయనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని కూడా ఫంక్షన్‌కి హాజరయ్యే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



