పెళ్లి చేసుకుని ఇంట్లోనే కూర్చుని మగ్గిపొమ్మంటారా?
on Jul 14, 2017

మన ఫ్రెండ్స్ కానీ.. బంధువులు కానీ అడిగిన ప్రశ్ననే తిప్పి తిప్పి అడిగితే మనకి ఎలా ఉంటుంది. ఒకసారి చెబుతాం..రెండు సార్లు చెబుతాం, అప్పటికి వినలేదంటే అరికాలిలో మంట నషాళానికి అంటుతుంది..ఇప్పుడు అచ్చం అలాంటి పరిస్ధితినే ఎదుర్కొంది హీరోయిన్ సమంత. అక్కినేని నాగచైతన్య-సమంతల వివాహం అక్టోబర్ 6న జరగబోతోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం రెండు విధాలుగానూ ఈ పెళ్లి జరగనుంది. ఇదిలా ఉంటే..అందరూ హీరోయిన్ల లాగే పెళ్లి తర్వాత సమ్ సినిమాలకు దూరమవుతుందా..? అన్న ప్రశ్నకు తనకు అలాంటి ఉద్ధేశ్యం లేదని సమంత చాలాసార్లు చెప్పుకొచ్చింది. చైతూ కూడా ఆమె కష్టపడి నిర్మించుకున్న కెరీర్‌ను మధ్యలో వదలడం తనకు ఇష్టం లేదని సినిమాల్లో కంటిన్యూ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఒక షోరూం ఓపెనింగ్‌కు వెళ్లిన సమంతకు ఇదే ప్రశ్న ఎదురుకావడంతో సమంతకు టెంపర్ లేచింది. ఎన్నిసార్లు చెప్పాలి..ఈ క్వశ్చన్ ఏ డాక్టర్‌నో..ఇంజినీరునో, టీచర్‌నో వేస్తారా..? వాళ్లు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్లు అదే వృత్తి చేస్తారా..? లేక మానేసి ఇంట్లో కూర్చుంటారా..? అని ఎదురు ప్రశ్న వేసింది. అయినా సమంత అడిగింది నిజమే కదా..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



