దొరబాబూ.. నీకిదేం పొయ్యే కాలం?!
on Mar 7, 2020
నటులు దొరబాబు, పరదేశి వ్యభిచారం చేస్తూ వైజాగ్‌లోని మాధవధారలో దొరికిపోవడంతో 'జబర్దస్త్' నటుల పరువంతా పోయినట్టయ్యింది. పైగా ఆ ఇద్దరూ ఆ ప్రోగ్రామ్‌లోని టాప్ రేంజిని ఆస్వాదిస్తున్న హైపర్ ఆది టీమ్ మెంబర్స్ కావడంతో, ఆదిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా మంది తిట్ల దండకం చదువుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి గ్రామానికి చెందిన దొరబాబు 2018లోనే నెల్లూరుకు చెందిన యాంకర్ నందినీరెడ్డిని ప్రేమ వివాహం చేసుకోవడం ఇక్కడ గమనించదగ్గ అంశం. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్యానికి గుర్తుగా పుట్టిని పాపకు శ్రీనిక అనే పేరు పెట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో దొరబాబు విటుడిగా పోలీసులకు దొరికిపోవడం అతని కుటుంబానికి, ముఖ్యంగా నందినీరెడ్డికి అశనిపాతమే అని చెప్పాలి. యాంకర్‌గా నెల్లూరులో మంచి పేరు ఉన్న నందిని టిక్ టాక్‌లోనూ ఫేమస్సే. అందుకే అంత చక్కని భార్య, ఇటీవలే ముద్దులొలికే పాప పుట్టగా, ఈ దగుల్బాజీ పనులేంటి దొరబాబూ.. అంటూ నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.
దొరబాబు, పరదేశి మాత్రమే కాదు, గతంలోనూ కొంతమంది జబర్దస్త్ నటులు వివాదాల్లో చిక్కుకున్నారు. అప్పట్లో నల్ల వేణుపై కొంతమంది దాడిచేసి గాయపరచడం సంచలనం సృష్టించింది. వేణు తదితరులు అభ్యంతరకర అంశాలు, డైలాగ్స్‌తో స్కిట్స్ చేస్తున్నాడనేది అతడిని కొట్టినవాళ్ల వాదన. అలాగే చలాకీ చంటి కూడా ఒకసారి వివాదానికి గురయ్యాడు. ఇప్పుడు దొరబాబు విషయానికి వస్తే.. వ్యభిచారం అతనికి కొత్తకాదనీ, కొంతకాలంగా నడుస్తున్న సెక్స్ రాకెట్‌తో అతనికి సంబంధం ఉందనీ పోలీసులు చెప్పడాన్ని బట్టి మనవాడు ఎలాంటివాడో అర్థమైపోతోంది. పైగా జబర్దస్త్‌లోకి ఎంటర్ కాకముందు అతను బీ గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవాడని కూడా బయటపడింది. కాగా దొరబాబు వ్యవహారం వైరల్ కావడంతో జబర్దస్త్ టీమ్‌లు అన్నింటికీ మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చాడని వినిపిస్తోంది. మున్ముందు ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే వారిని జబర్దస్త్ నుంచి తొలగిస్తానని ఆయన స్పష్టం చేశాడంటున్నారు. ఇప్పటికే దొరబాబు, పరదేశి.. ఇద్దరినీ ఆ షో నుంచి బహిష్కరించారని సమాచారం.
1. నందినీరెడ్డితో దొరబాబు వివాహం
2. నందినీరెడ్డి సీమంతం నాటి ఫొటో
3. కుమార్తె, భార్యతో దొరబాబు
4. దొరబాబు, నందిని ఆల్బమ్ ఫొటో
Also Read