మెగాస్టార్ 152 సెట్ వర్క్ షురూ
on Jun 26, 2019
మెగాస్టార్ 151 సినిమా 'సైరా నరసింహారెడ్డి' చిత్రీకరణ పూర్తయింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. అంతకంటే ముందే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయనున్న మెగాస్టార్ 152 షూటింగ్ ప్రారంభం కానుంది. చిరంజీవి పుట్టినరోజున ఆగస్టు 22న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి, సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఆల్రెడీ సెట్ వర్క్ స్టార్ట్ అయింది. హైదరాబాద్‌లో 'రంగస్థలం' కోసం సెట్ వేసిన ప్రాంతంలో కాస్త పక్కకు పెద్ద పెద్ద ఇళ్ల సెట్స్ వేస్తున్నారు. ఆల్రెడీ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. 'ఠాగూర్', 'స్టాలిన్' తరహాలో చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టు మెసేజ్ ఓరియెంటెడ్ కథను కొరటాల సిద్ధం చేశారట. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' ఇలా కొరటాల సినిమాలు కూడా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, మెసేజ్‌తో ఉంటాయి. చిరు కోసం ఎలాంటి కథ రెడీ చేశారో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
