యాక్షన్‌లో 'డిస్కో రాజా'
on Jul 13, 2019
యాక్షన్ అంటే ఏంటో తెలుసు. మరి, డిస్కో యాక్షన్ ఏంటి? తెలియాలంటే మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న 'డిస్కో రాజా'లో చూడాలి. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సినిమా కోసం స్పెషల్‌గా తీర్చిదిద్దిన సెట్‌లో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే రవితేజ 'డిస్కో రాజా' లొకేషన్‌లో మానిటర్‌లో యాక్షన్ సీన్ ఎలా వస్తుందో చూసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, 'నన్ను దోచుకుందువటే', 'ఇస్మార్ట్ శంకర్' ఫేమ్ నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.