ఐబొమ్మ రవి అరెస్ట్.. తిమింగలాన్ని వదిలేసి చిన్న చేపను పట్టుకున్నారా..?
on Nov 20, 2025

ఐబొమ్మ రవి వల్ల నిర్మాతలు నష్టపోలేదా?
సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ
ఐబొమ్మ రవి చిన్న చేప మాత్రమేనా?
అసలైన పైరసీ తిమింగలం ఎవరు?
కొద్దిరోజులుగా పైరసీ వెబ్ సైట్ 'ఐబొమ్మ' పేరు మారుమోగిపోతోంది. దానికి కారణం.. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం. (iBomma Ravi)
ఐబొమ్మ రవి అరెస్ట్ పై సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాతలకు నష్టం కలిగిస్తున్న పైరసీ తిమింగలం రవి అరెస్ట్ తో.. సినిమాలకు మంచి రోజులు వచ్చాయని, మళ్ళీ థియేటర్లు కళకళలాడతాయని అభిప్రాయపడుతున్నారు. (Immadi Ravi)
అయితే పైరసీ సంద్రంలో రవి నిజంగానే తిమింగలమేనా అంటే.. ఐబొమ్మ మీద అవగాహన ఉన్న మెజారిటీ ఆడియన్స్ మాత్రం.. అసలు కాదని, అతను చిన్న చేప మాత్రమేనని చెబుతున్నారు.
ఐబొమ్మ వల్ల ప్రధాన నష్టం నిర్మాతలకు కాదు.. ఓటీటీ సంస్థలకు. అవును ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఆసక్తికర చర్చ.
Also Read: రాజా సాబ్ వాయిదా పడుతుందా.. అందుకే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయట్లేదా?
నిజానికి ఐబొమ్మ సైట్ ప్రధానంగా నడిచేది ఓటీటీ కంటెంట్ మీద. ఓటీటీలో విడుదలైన సినిమాలు, సిరీస్ లు.. మంచి క్వాలిటీతో వెంటనే ఐబొమ్మలో ప్రత్యక్షమవుతాయి. అంటే ఐబొమ్మ వల్ల ప్రధానంగా నష్టపోయింది ఓటీటీ సంస్థలు.
కానీ, ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత అందరూ.. పైరసీ తిమింగలం దొరికిందని, సగానికి పైగా పైరసీ ఆగిపోయినట్లేనని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. పైరసీ తిమింగలం ఐబొమ్మ రవి కాదు.. మూవీరూల్స్ వంటి సైట్లు.
థియేటర్లలో కొత్త సినిమా విడుదలైన కాసేపటికే మూవీరూల్స్ వంటి సైట్స్ లో అది ప్రత్యక్షమవుతుంది. మూవీరూల్స్ పైరసీ సైట్ అనేది పది పదిహేనేళ్ల నుండి ఉంది. ఎంత పెద్ద సినిమా అయినా.. రిలీజ్ రోజే ఈ సైట్ లో పెట్టేస్తారు. అసలు నిర్మాతలకు ప్రధానంగా నష్టం జరిగేది.. ఈ మూవీరూల్స్ వంటి సైట్స్ వల్లనే.
ఐబొమ్మ ప్రధానంగా నడిచింది ఓటీటీ కంటెంట్ మీద. ఇప్పుడు ఐబొమ్మ ఆగిపోతే.. పైరసీ ఆగిపోయినట్లు కాదు, నిర్మాతల కష్టాలు తీరిపోయినట్లు అంతకంటే కాదు. థియేటర్ ప్రింట్స్ తో అసలైన నష్టం కలిగిస్తున్న మూవీరూల్స్ వంటి సైట్లు.. ఐబొమ్మకు ముందు ఉన్నాయి, ఐబొమ్మ తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. అసలైన ఆ పైరసీ సైట్లకు చెక్ పెట్టగలగాలి. అప్పుడే ఈ పైరసీకి ఎంతో కొంత అడ్డుకట్ట పడుతుంది.
పైరసీ సంద్రంలో ఐబొమ్మ రవి అనేవాడు చిన్న చేప మాత్రమే. మూవీరూల్స్ వంటి తిమింగిలాల వల్లే అసలు నష్టం. ఒక్క మూవీరూల్స్ సైట్ ని ఆపగలిగితే.. 50 శాతం పైరసీ ఆగిపోయినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటే.. పైరసీ ప్రపంచంలో ఆ సైట్ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
చూద్దాం మరి.. త్వరలో మూవీరూల్స్ వంటి సైట్స్ కి కూడా చెక్ పెడతారేమో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



