సంగీత దర్శకుడిగా 'సామజ వరగమన' సింగర్
on Nov 13, 2019
'అల... వైకుంఠపురములో' సినిమాలో 'సామజ వరగమన' సాంగ్ యూట్యూబ్‌లో ఎంత హిట్ అయ్యిందో, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే, ఆటోల నుండి అందరి ఇళ్లల్లో మారుమోగుతోంది. సాంగ్ ఇంత హిట్ కావడానికి సిద్ శ్రీరామ్ వాయిస్ కూడా ఓ కారణమే. అతడు పాడే విధానంపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ... మెజార్టీ తెలుగు ప్రేక్షకులు అతణ్ణి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో హాట్ షాట్ సింగర్ ఎవరైనా ఉన్నారంటే సిద్ శ్రీరామ్ అని చెప్పడంలో తప్పేం లేదు. 'నిన్ను కోరి'లో 'అడిగా అడిగా', 'గీత గోవిందం'లో 'ఇంకేం ఇంకేం కావాలే', 'హుషారు'లో 'ఉండిపోరాదే', 'టాక్సీవాలా'లో 'మాటే వినదుగా', 'ఎబిసిడి'లో 'మెల్లమెల్లగా మెల్లగా'... ఇలా తెలుగు సిద్ శ్రీరామ్ పాడిన పాటల్లో మ్యాగ్జిమమ్ పాటలు హిట్టు. ఇప్పుడీ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడు.
సిద్ శ్రీరామ్‌ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఆయన 'వానం కొట్టాటుమ్' అని ఓ సినిమా నిర్మిస్తున్నారు. దానికి సిద్ శ్రీరామ్ సంగీతం అందిస్తున్నాడు. అతడు గాయకుడిగా పరిచయమైనది కూడా మణిరత్నం 'కడల్' సినిమాతో! తెలుగులో ఆ సినిమా 'కడలి'గా విడుదలైంది. అందులో 'యాడికే' పాటను సిద్ శ్రీరామ్ పాడాడు. త్వరలో ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.
Also Read