ఇంట్లో ఇలియానా కత్తెరలు
on May 4, 2020

విరాట్ కోహ్లీకి అతడి శ్రీమతి, కథనాయిక అనుష్క శర్మ కటింగ్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ కత్తెర పట్టుకుని తన కుమారుడు తైమూర్‌కి కటింగ్ చేశారు. ఇలియానాకి అలా ఎవరూ చేయలేదు. తానే స్వయంగా కత్తెర తీసుకొని చేతికి పని చెప్పారు. క్షవరం చేసుకున్నారు. అదేనండీ... జుట్టు కత్తిరించుకున్నారు. కూటి కోసం కోటి విద్యలు అని మన పెద్దలు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కూటి కోసం కాదు, కాలక్షేపం కోసం కొత్త విద్యలు నేర్చుకుంటున్నారు. అందులో క్షవర కళ ఒకటి. ఇలియానా కూడా నేర్చుకున్నారు. మిగతా సెలబ్రిటీలు అందరూ ఎలాగైతే ఇంటి నుండి బయట అడుగు పెట్టడం లేదో? ఇలియానా కూడా అలాగే ఇంటి నుండి కాలు బయట పెట్టకుండా చక్కగా లాక్‌డౌన్‌లో ఉన్నారు. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. యాక్టివ్ గా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక హిందీ సినిమా మాత్రమే ఉంది. తెలుగులో సినిమాలు డిస్కషన్స్ స్టేజిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



