దేవరకొండ సినిమాలకు నిర్మాతలు మారారు
on May 4, 2020

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత 'దిల్' రాజు నిర్మాణంలో ఆయన ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఆరు నెలలుగా దేవరకొండ, ఇంద్రగంటి కాంబోలో సినిమా అని వార్తలు వస్తున్నాయి. అయితే... నిర్మాతగా దిల్ రాజు పేరు ఎక్కడా వినపడలేదు. ఎందుకంటే... దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... దిల్ రాజు నిర్మాణంలో శివ నిర్వాణ బదులు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నారు. అలాగని, శివ నిర్మాణ కథను పక్కన పెట్టలేదు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్‌లో విజయ్ దేవరకొండ అతడి సినిమా చేయనున్నారు. నిజం చెప్పాలంటే... మైత్రిలో 'హీరో' అని బైలింగ్వల్ సినిమా స్టార్ట్ చేశారు. అది మధ్యలో ఆగింది. నిర్మాతల నష్టాలను కవర్ చేయడానికి, వాళ్లకు శివ నిర్వాణ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట. ఆల్రెడీ దిల్ రాజు నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి 'వి' చేశారు. ఈ దర్శకుడు, నిర్మాత మధ్య అండర్ స్టాండింగ్ ఉండడంతో వీళ్లకు సినిమా చేస్తున్నారు. అలా అలా పరిస్థితుల ప్రభావం వల్ల విజయ్ దేవరకొండ సినిమాలకు నిర్మాతల మారారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



