రెజీనా భయపెడుతోంది
on Jul 13, 2017
రెజీనా చూడ్డానికి ఎంత అందంగా ఉంటుంది... ఆ అమ్మాయిని దెయ్యంగా ఊహించగలమా? కానీ మన తమిళ తంబీలు రెజీనాని దెయ్యంగా ఊిహించేసుకున్నారు. ఊహించడమే కాదు... సినిమా కూడా తీసేశారు. సినిమా పేరు‘నంజం మరప్పతిల్లై’. సెల్వరాఘవన్ దర్శకుడు. గౌతమ్ మీనన్ నిర్మాత. హీరో ఎస్.జె.సూర్య. కథ రిత్యా రెజీనా, ఎస్.జె.సూర్య భార్యాభర్తలట. ఇంటర్వెల్ ముందు ఎస్.జె.సూర్య... రెజీనాని దారుణంగా చంపేసి, మట్టిలో కప్పేస్తాడట. అక్కడ్నుంచి సూర్యకి కష్టాలు మొదలు. రెజీనా.. దెయ్యంగా మారి సూర్యాని ముప్పుతిప్పలు పెడుతుందట. మరి చివరికి ఏమవుతుందో. ఇందులో హారర్ సన్నివేశాలు ముందెన్నడూ చూడని రీతిలో ఉంటాయని టాక్. మరి రెజీనా దెయ్యంగా ఎలా చేసిందో చూడాలి. తమిళంలో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా... తెలుగులో కూడా విడుదలవ్వడం ఖాయంగానే కనిస్తుంది.
Also Read