భర్తతో విద్యకు విబేధాలు.. విడిపోనున్నారా..?
on Nov 16, 2016
ప్రజంట్ టాలీవుడ్ టూ బాలీవుడ్ ఏ ఇండస్ట్రీ చూసినా తెగదెంపులే కనిపిస్తున్నాయి..పెళ్లయిన జంటలు...సహజీవనం చేస్తున్న జంటలు..ప్రేమలో మునిగి తేలుతున్న జంటలు ఎవరైనా సరే విడాకులో..విడిపోవడమే చేస్తున్నారు. అమలాపాల్-ఎల్ విజయ్, కమల్‌హసన్-గౌతమి, సల్మాన్-వురులియాలు విడిపోయారు..కాగా ఈ లిస్ట్‌లోకి విద్యాబాలన్ దంపతులు కూడా చేరనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కెరిర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే పారిశ్రామిక వేత్త సిద్దార్థ్ రాయ్ కపూర్‌ని వివాహం చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటోంది విద్య. పెళ్ళయినా నటనకు గుడ్‌బై చెప్పకుండా మంచి కథలు ఎంచుకుని తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
అయితే ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకోబోతోందని బాలీవుడ్ కోడై కూస్తోంది. గత కొంతకాలంగా భర్త సిద్ధార్థ్ రాయ్‌తో విద్య అంత సఖ్యతగా ఉండటం లేదని..ఇద్దరికి క్షణం కూడా పొసగడం లేదని అందుకే విద్య విడిపోవాలని నిర్ణయం తీసుకుందని బీటౌన్ టాక్. ఈ విషయం ఆ నోటా..ఈ నోటా విద్యాబాలన్ చెవిన పడింది. అంతే ఈ వార్తలపై అంతెత్తుని లేచి..అవన్నీ కేవలం రూమర్లేనని తామిద్దరం కలిసే ఉంటున్నామని, కలిసే ఉండబోతున్నామని స్పష్టం చేసింది. ఏ గొడవలు లేకపోతే..అంత సఖ్యతగా ఉంటే భర్తతో కలిసి మీడియా ముందుకు రావొచ్చుగా కదా..!