నెలకో సినిమాతో `హలో` భామ!
on Nov 19, 2021
అక్కినేని బుల్లోడు అఖిల్ కథానాయకుడిగా నటించిన రెండో చిత్రం `హలో` (2017)తో నాయికగా తొలి అడుగేసింది కళ్యాణి ప్రియదర్శన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ - నటి లిజీ గారాలపట్టి అయిన కళ్యాణి.. మొదటి ప్రయత్నంలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. `చిత్రలహరి`, `రణరంగం` రూపంలో మరో రెండు తెలుగు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. వీటిలో `చిత్రలహరి` ఫర్లేదనిపించినా.. `రణరంగం` నిరాశపరిచింది. ఈ క్రమంలో.. తమిళ, మలయాళ భాషలవైపు దృష్టి సారించింది కళ్యాణి.
ఆమధ్య శివకార్తికేయన్ కి జోడీగా `హీరో`లో అలరించిన కళ్యాణి.. నవంబర్ నుంచి జనవరి వరకు అంటే వరుసగా మూడు నెలల పాటు నెలకో సినిమాతో పలకరించబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ శింబుకి జతగా కళ్యాణి నటించిన తమిళ చిత్రం `మానాడు` నవంబర్ 25న రిలీజ్ కానుండగా.. మాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ `మరక్కర్` డిసెంబర్ 2న విడుదల కానుంది. అలాగే మరో మలయాళ చిత్రం `హృదయం` జనవరి 21న జనం ముందు నిలవనుంది. మరి.. వరుస నెలల్లో రాబోతున్న ఈ చిత్రాలతో కళ్యాణి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service




