మరోసారి ఆర్మీ ఆఫీసర్ గా విజయ్!
on Nov 19, 2021

ఈ ఏడాది సంక్రాంతికి `మాస్టర్`గా పలకరించిన కోలీవుడ్ స్టార్ విజయ్.. త్వరలో `బీస్ట్`గా ఎంటర్టైన్ చేయనున్నాడు. `కోలమావు కోకిల` (తెలుగులో `కోకోకోకిల`), `డాక్టర్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ సరసన `బుట్టబొమ్మ` పూజా హెగ్డే కనిపించనుంది. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 2022 వేసవిలో ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ థియేటర్స్ లోకి రాబోతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విజయ్ పోషిస్తున్న పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా తన క్యారెక్టర్ ఉంటుందని కోలీవుడ్ బజ్. అదే గనుక నిజమైతే.. `తుపాకి` (2012) తరువాత దాదాపు పదేళ్ళకి ఈ తరహా పాత్రలో విజయ్ కనిపించబోతున్నట్లే. మరి.. విజయ్ కెరీర్ లో మెమరబుల్ మూవీగా `తుపాకి` నిలిచినట్టే.. `బీస్ట్` కూడా ఆ ఫీట్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
కాగా, `బీస్ట్` తరువాత టాలీవుడ్ కెప్టెన్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ బైలింగ్వల్ మూవీ చేయనున్నాడు విజయ్. అయితే, ఇందులో మాత్రం ఎంతో ఫన్నీగా తన రోల్ ఉంటుందని బజ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



