నయన్ తో వరుసగా మూడోసారి.. హ్యాట్రిక్ కోసం రీమేక్ సబ్జెక్ట్!
on Nov 19, 2021

తెలుగు చిత్రం `హనుమాన్ జంక్షన్`(2001)తో దర్శకుడైన మోహన్ రాజా.. 20 ఏళ్ళ తరువాత `గాడ్ ఫాదర్` కోసం మళ్ళీ టాలీవుడ్ బాట పట్టారు. మధ్యలో పలు తమిళ చిత్రాలను తెరకెక్కించి కోలీవుడ్ లో రీమేక్స్ స్పెషలిస్ట్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజా.. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసిఫర్`ని మెగాస్టార్ చిరంజీవితో `గాడ్ ఫాదర్`గా తెలుగులో రీమేక్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. నయన్ కాంబినేషన్ లో మోహన్ రాజా వరుసగా చేస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబోలో `తని ఒరువన్`, `వేలైక్కారన్` అనే తమిళ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు కూడా స్ట్రయిట్ సబ్జెక్ట్స్ తోనే తెరకెక్కాయి. అయితే, వీరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో చిత్రం `గాడ్ ఫాదర్` మాత్రం రీమేక్ కావడం గమనార్హం. మరి.. రీమేక్ తోనూ మోహన్ రాజా, నయన్ కాంబో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. కాగా, 2022లో `గాడ్ ఫాదర్` థియేటర్స్ లో సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



