ఆక్సిజన్ కోసం బైక్‌ను అమ్మకానికి పెట్టిన టాలీవుడ్ యాక్టర్!
on May 1, 2021
'అవును' మూవీలో పూర్ణ భర్తగా, 'ఫిదా'లో సాయిపల్లవిని పెళ్లాడాలనుకొనే పక్కింటబ్బాయిగా నటించిన హర్షవర్ధన్ రాణే ఆక్సిజన్ సప్లైస్ కోసం నిధుల్ని సమీకరించడానికి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను అమ్మకానికి పెట్టాడు. శనివారం తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా బైక్‌ను క్లీన్ చేస్తున్న ఫొటోను షేర్ చేసి, "ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్కు బదులుగా నా మోటార్‌సైకిల్‌ను ఇవ్వాలనుకుంటున్నాను. కొవిడ్‌తో పోరాడుతూ అవసరమైన వాళ్లకు వాటిని అందజేయాలనుకుంటున్నా. హైదరాబాద్‌లో మంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎక్కడ ఉంటాయో చెప్పండి." అంటూ రాసుకొచ్చాడు.
ప్రతిరోజూ లక్షల కొద్దీ కొత్త కొవిడ్ పాజిటివ్ కేసులతో దేశపు హెల్త్‌కేర్ సిస్టమ్ ప్రమాదంలో పడింది. హాస్పిటల్స్‌లో బెడ్లు, ఆక్సిజన్ సప్లైస్, ప్రాణాలు కాపాడే మెడిసిన్స్ దొరక్క పలువురి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. రోజూ సామూహిక దహనాలతో శ్మశానవాటికలు నిండిపోయి కనిపిస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా బెడ్లు అవసరమైన వారి, ఆక్సిజన్ అవసరమైన వారి, ప్రాణాలు కాపాడే మెడిసిన్స్ అవసరమైన వారి వివరాలను షేర్ చేస్తూ వారిని ఆదుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
అదే తరహాలో హర్షవర్ధన్ రాణే కూడా తన వంతుగా కొవిడ్‌తో సతమతమవుతూ ఆక్సిజన్ కోసం అల్లాడుతున్నవారికి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. దాని కోసం తన యెల్లో కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను అమ్మకానికి పెట్టాడు.
Also Read