ఐ మిస్ యు హేమంత్.. తల్లడిల్లిన విజయ్!
on May 1, 2021
విజయ్ దేవరకొండ స్టార్ హీరోనే కావచ్చు, అభిమానులు అతడిని రౌడీ హీరో అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండవచ్చు. అయితే అతడిలో చాలా సున్నిత మనస్కుడు ఉన్నాడనే విషయం మరోసారి స్పష్టమైంది. అతడి అభిమాని హేమంత్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలియగానే ఎమోషనల్ అయిపోయాడు విజయ్. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా హేమంత్ నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేసి, హృదయాన్ని స్పృశించే మాటలు రాసుకొచ్చాడు.
"నిన్ను మిస్సవుతున్నా హేమంత్. మనం మాట్లాడుకున్నందుకు ఆనందంగా ఉంది. నీ అందమైన నవ్వును నేను చూశాను. నీ ప్రేమను ఫీల్ అవుతున్నాను, నీకు కొంత ఇస్తాను. నా కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే, ఇప్పుడు నీకోసం ప్రార్థిస్తున్నానని చెప్తున్నాను. ఈ స్వీట్ లిటిల్ బాయ్‌ను నాతో కలిపిన వారందరికీ థాంక్యూ" అని ట్వీట్ చేశాడు.
ఆ తర్వాత దానికి కొనసాగింపుగా, "హేమంత్ నువ్వు మిస్సవవచ్చు.. ఈ జ్ఞాపకాన్ని నేను కోరుకుంటున్నా. నా టైమ్‌లైన్‌లో ఎప్పటికీ జీవించే ఉంటావు." అని రాసుకొచ్చాడు.
కొద్ది రోజుల క్రితం ఓ వీడియో కాల్ ద్వారా హేమంత్‌తో విజయ్ మాట్లాడాడు. అప్పుడతడికి తన 'రౌడీ' బ్రాండ్ షర్ట్‌ను కూడా పంపించాడు.
Also Read