`కేజీఎఫ్: ఛాప్టర్ 2`లోనూ.. 2 వెర్షన్స్ ఐటమ్ సాంగ్?
on May 1, 2021
కన్నడ చిత్ర సీమలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమా `కేజీఎఫ్: ఛాప్టర్ 1`. రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పిరియడ్ డ్రామా.. పాన్ - ఇండియా మూవీగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే సెకండ్ పార్ట్ రానున్న సంగతి తెలిసిందే. `కేజీఎఫ్: ఛాప్టర్ 2` పేరుతో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 16న విడుదలకు సిద్ధమైంది.
ఇదిలా ఉంటే.. `ఛాప్టర్ 1`లో ఎలాగైతే రెండు వెర్షన్స్ ఐటమ్ సాంగ్ ఉందో.. `ఛాప్టర్ 2`లోనూ అలాగే రెండు వెర్షన్స్ ఐటమ్ సాంగ్ ఉందని సమాచారం. `ఛాప్టర్ 1`లో సౌత్ వెర్షన్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాపై.. హిందీ వెర్షన్ కోసం బాలీవుడ్ భామ మౌనీ రాయ్ పై స్పెషల్ సాంగ్ ని రూపొందించి అలరించిన యూనిట్.. `ఛాప్టర్ 2`లోనూ అదే తరహాలో ప్లాన్ చేశారని బజ్. అంతేకాదు.. జాక్వలైన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి వంటి పేర్లు ఈ ప్రత్యేక గీతం కోసం వినిపిస్తున్నాయి. మరి.. `కేజీఎఫ్: ఛాప్టర్ 2` ఐటమ్ సాంగ్ కి సంబంధించిన ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also Read