తగ్గేదేలే.. బన్నీ- హరీష్ శంకర్ కాంబోలో మరో మూవీ!
on Feb 3, 2022

'పుష్ప' సినిమా ఫీవర్ తగ్గలేదు. పిల్లల నుంచి పెద్దల వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎక్కడా చూసినా 'తగ్గేదేలే' అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగే వినిపిస్తుంది. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం 'ఎందుకు తగ్గాలి తగ్గేదేలే' అంటూ బన్నీతో కలిసి దిగిన ఫోటో షేర్ చేశాడు. దీంతో వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందంటూ న్యూస్ వినిపిస్తోంది.
తాజాగా బన్నీని కలిసిన హరీష్.. ఆయనతో ఓ ఫోటో దిగి ట్విట్టర్ లో షేర్ చేశాడు. అంతేకాదు,'మేమిద్దరం ఎప్పుడు కలిసిన సరదాగా ఉంటుంది. బన్నీతో గ్రేట్ టైం గడిపాను. తగ్గేదేలే.. ఎందుకు తగ్గాలి?' అంటూ హరీష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

గతంలో బన్నీ, హరీష్ కాంబినేషన్ లో 'దువ్వాడ జగన్నాథమ్(డీజే)' సినిమా వచ్చింది. 2017 లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్ తో హరీష్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. మరి ఈ విషయమై హరీష్ బన్నీని కలిశాడా? లేక వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోందా అనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం బన్నీ దృష్టి పుష్ప పార్ట్-2 మీద ఉంది. ఆ తర్వాత బోయపాటి, కొరటాలతో ప్రాజెక్ట్స్ చేసే అవకాశముంది. హరీష్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



