ఈ బాడీ బిల్డర్ మనకు బాగా తెలిసిన యాక్టరే.. గుర్తుపట్టారా?
on May 16, 2021
శేఖర్ కమ్ముల సినిమా 'హ్యపీ డేస్' (2007)తో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు రాహుల్. "ఐ లవ్ యూ శ్రావ్స్" అంటూ అందర్నీ లవ్‌లో పడేసుకున్నాడు. అతడి టిపికల్ వాయిస్, స్వచ్ఛంగా కనిపించే ముఖం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో అతడి క్యారెక్టర్ పేరు అర్జున్ అయినా, బక్కగా ఉంటాడని ఫ్రెండ్స్ అందరూ హాస్యంగా టైసన్ అని పిలుస్తుంటారు. ఆ సినిమాతో రాహుల్ అనే అసలు పేరు కంటే సినిమాలో అతడికి ఉపయోగించిన నిక్ నేమే అతడికి పాపులారిటీ తీసుకొచ్చింది.
'హ్యాపీ డేస్'తో అంతగా ఆకట్టుకున్న టైసన్ కెరీర్ ఆశ్చర్యకరంగా ఏమాత్రం సంతృప్తికరంగా సాగలేదు. ఆ సినిమా వచ్చి ఇప్పటికి 14 సంవత్సారలయింది. ఇన్నేళ్లలో రాహుల్ నటించగా విడుదలయ్యింది ఐదంటే ఐదు సినిమాలే. కానీ 'హ్యాపీ డేస్' తర్వాత అతడు చేసిన ఏ సినిమా కూడా అతడి కెరీర్‌కు ఉపయోగపడలేదు. ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. నాలుగేళ్ల క్రితం వచ్చిన అతడి చివరి సినిమా 'వెంకటాపురం' అనే థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలను కొంతైనా పొందగలిగింది.
అలాంటి రాహుల్ అలియాస్ టైసన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బక్కపలుచని ఆ కుర్రాడు ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో బాడీ బిల్డర్‌లా తయారయ్యాడు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అతడు పోస్ట్ చేసిన పిక్చర్స్ చూస్తే ఆశ్చర్యంతో మన కళ్లు పెద్దవి కాకమానవు. అంతలా మేకోవర్ అయ్యాడు టైసన్.
నిజంగా బాక్సర్ మైక్ టైసన్ ఎలా కండలు తిరిగిన దేహంతో ఉంటాడో అలాగే తయారయ్యాడు. టైసన్ అనే నిక్‌నేమ్‌ను సార్థకం చేసుకున్నట్లే కనిపిస్తున్నాడు. ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ రాజేశ్ ఆధ్వర్యంలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తను పోస్ట్ చేసిన పిక్చర్స్‌కు పెట్టిన క్యాప్షన్‌లో తెలియజేశాడు. కిల్లర్ బాడీకి తోడు గుబురు మీసాలతో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు టైసన్.
ప్రస్తుతం అతను '100 క్రోర్స్' అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా అయినా అతడికి పేరు తెస్తుందేమో చూడాలి.
Also Read