'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత మహేష్ బాబుతోనే!
on Sep 19, 2019

దర్శక ధీరుడు, జక్కన్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా కోసం ప్రేక్షకలోకం ఎప్పటి నుండో ఎదురు చూస్తోంది. ఒకరితో మరొకరు సినిమా చేయాలని వీరిద్దరూ ఎదురు చూస్తున్నారు. మహేష్, రాజమౌళికి నిర్మాత కె.ఎల్. నారాయణ అడ్వాన్సులు ఇచ్చారు. ఆయన నిర్మాణంలో సినిమా ఉంటుంది. మరొకరు నిర్మాణ భాగస్వామిగా ఉండే అవకాశం ఉంది. జనవరి 2020 తర్వాత ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు సెట్స్ మీదకు వెళుతుందని ఇండస్ట్రీ టాక్. ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చేస్తున్నారు. జనవరికి ఆ సినిమా విడుదల అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి చేస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ బ్యాలన్స్ ఉంటాయి. అవి పూర్తి చేసి, సినిమా పబ్లిసిటీపై దృష్టి పెట్టి జూలైలో సినిమా విడుదల అయ్యేవరకూ రాజమౌళి బిజీ. మధ్యలో మహేష్ కథపై కొంత దృష్టి పెట్టినా... 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదల తర్వాతే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టగలరు. 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదల తర్వాత మహేష్ బాబుతోనే రాజమౌళి సినిమా ఉండటం ఖాయమని ఫిలింనగర్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



