సైరా... మరణమే గొప్ప విజయం!
on Sep 19, 2019
తెలుగు ప్రేక్షకులు విషాదాంత ముగింపును జీర్ణించుకోలేరని చెప్పడానికి పలు సినిమాలు ఉదాహరణలుగా నిలిచాయి. తమిళ, కన్నడ సినిమాల్లో ఉన్నట్టు తెలుగులో సాడ్ ఎండింగ్స్ తక్కువ. ఈ సెంటిమెంట్ పక్కన పెట్టిన 'సైరా నరసింహారెడ్డి' టీమ్ విషాదాంత ముంగిపు వైపు మొగ్గు చూపింది. చరిత్రలోకి తొంగి చూస్తే... ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తెల్లదొరలు ఉరి తీశారు. చరిత్రలో ఉన్నది ఉన్నట్టు తీశామని దర్శకుడు సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు. విషాదాంత ముగింపును ప్రేక్షకులు హర్షిస్తారా? అనే ప్రశ్నకు... "ఉయ్యాలవాడ ఉరి తరవాత ఆయన తలను 30 ఏళ్లు కోటగుమ్మానికి వేలాడదీశారు. తెల్లదొరలు అలా చేశారు అంటే, వాళ్లను ఉయ్యాలవాడ ఎంత భయపెట్టి ఉండాలి? నా దృష్టిలో అది గొప్ప విక్టరీ. ఉయ్యాలవాడ మరణంతో భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమం మొదలైంది. ఆయన జీవితం, త్యాగం, మరణం... గొప్ప విజయం" అని ఆయన అన్నారు. దీన్నిబట్టి 'సైరా నరసింహారెడ్డి'లో చిరంజీవి పాత్ర మరణిస్తుందని ఊహించవచ్చు. ఆల్రెడీ ట్రైలర్ లో ఉరికంబంలో నిలబడిన చిరంజీవి విజువల్స్ చూపించి... ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తున్నారు.
Also Read