యూట్యూబ్‌లో ఖైదీ vs శాతకర్ణీ..!
on Dec 17, 2016

ప్రజంట్ టాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల కళ్లన్నీ రెండు సినిమాలపైనే..అవి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.150, బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి. చాలా రోజుల తర్వాత ఇద్దరు అగ్రనటులు సై అంటే సై అంటున్నారు. వీరిద్దరూ ఎప్పుడో సంక్రాంతికి జరిగాల్సిన వార్‌ను ఇప్పుడే స్టార్ట్ చేశారు. చిరు నటించిన ఖైదీ నెం.150 టీజర్ రీసెంట్ రిలీజైంది. ఇలా యూట్యూబ్‌లోకి వచ్చిందో లేదో గతంలో ఉన్న రికార్డులన్ని బద్దలుకొడుతూ ఖైదీ ప్రభంజనం సృష్టించాడు. కేవలం 3 గంటల 5 నిమిషాల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ సాధించి..యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు చిరు.
ఇక నటసింహం బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేసింది. బాలయ్య విశ్వరూపం ఎలా ఉంటుందో చూడాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులు ట్రైలర్‌ను తెగ చూసేశారు. దీంతో 12 గంటల వ్యవధిలోనే దాదాపు 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు 1 మిలియన్ మార్క్‌ను చేరుకోవడానికి కూడా పెద్దగా టైం తీసుకోలేదు. సినిమా విడుదలకు ఇంకా టైం ఉండటంతో లాంగ్‌రన్‌లో యూట్యూబ్ కింగ్‌గా ఎవరు నిలుస్తారోనని ఫ్యాన్స్ తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



