దుమ్ములేపుతున్న ఖైదీ నెం 150 సాంగ్..
on Dec 17, 2016
.jpg)
కనిపించి తొమ్మిదేళ్లయినా చెక్కు చెదరని మాస్ ఫాలోయింగ్..ఆయన విసిరే పంచ్ డైలాగుల కోసం.. స్టైల్‌గా చేసే డ్యాన్స్‌ల కోసం అదే నిరీక్షణ. ఈ ఎలిమెంట్స్‌ని బట్టి ఎవరి గురించి చెపుతున్నామో మీకు ఈపాటికే అర్థమైపోతోంది..ఎస్ మీరు గెస్ చేసింది కరెక్టే ఆయనే మెగాస్టార్ చిరంజీవి. అభిమానులను అలరించడానికి లాంగ్ గ్యాప్ తర్వాత ఖైదీ నెం.150 గా వస్తున్నారు చిరు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే..చిత్రయూనిట్ కన్నా ఫాస్ట్‌గా మెగా అభిమానులు ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలెట్టేశారు. "నీకు నీవే సాటి, నీకెవ్వరూ పోటీ రారు, బాస్ ఈజ్ బ్యాక్, మెగాస్టార్ ఈజ్ ఎవర్ గ్రీన్" అని రాసుకుంటూ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు.
కొందరు మెగా అభిమానులు ఇంకొ అడుగు ముందుకేసి ఏకంగా చిరుపై అభిమానాన్ని పాటల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. మొన్నామధ్య హేమచంద్ర పాడిన "జై చిరంజీవా..జై చిరంజీవా" అనే పాట యూట్యూబ్‌లో హల్‌చల్ చేసింది..తాజాగా మరో మెగాస్టార్ అభిమాని జీజీ ప్రసాద్ రాయగా, దీపు పాడిన "అద్దిరబన్నా హైలెస్సో " అనే పాట యూట్యూబ్‌లో కొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే రెండు లక్షలకు పైగా వ్యూస్‌తో మరో రికార్డు దిశగా దూసుకెళుతోంది. దీనిని బట్టి చిరు రాక కోసం అభిమానులు ఎంతగా నిరీక్షిస్తున్నారో అర్థమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



