ధృవ ఫంక్షన్‌కు అతిథిగా సీఎం కుమారుడు
on Dec 1, 2016
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ధృవ విడుదల సమయం దగ్గరపడే కొద్ది అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. దానిని మరింత పెంచేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ధృవ ప్రి-రిలీజ్ వేడుకను డిసెంబర్ 4న యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ వేడుకకు ధృవ టీం కేటీఆర్‌ను ఆహ్వానించిందని, ఆయన రావడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు మెగా హీరోలు హాజరయ్యే అవకాశం ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.