పవన్ సినిమాలో నిధి పాత్ర అంతేనా!
on Dec 17, 2021

`సవ్యసాచి` సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన నిధి అగర్వాల్.. తన మూడో తెలుగు చిత్రంగా విడుదలైన `ఇస్మార్ట్ శంకర్`తోనే తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది. మరోవైపు హిందీ, తమిళ
సినిమాల్లోనూ రాణించే ప్రయత్నం చేస్తోంది ఈ గ్లామరస్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నిధి చేతిలో రెండు తెలుగు చిత్రాలున్నాయి. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తున్న `హరిహర వీరమల్లు` కాగా.. మరొకటి సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ సరసన యాక్ట్ చేస్తోన్న `హీరో`. వీటిలో `హీరో` జనవరి 26న విడుదల కానుండగా.. `హరిహర వీరమల్లు` ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతోంది.
కాగా, `హరిహర వీరమల్లు`లో నిధి పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. నిధి పోషిస్తున్న పంచమి పాత్ర కేవలం ప్రథమార్ధానికే పరిమితమట. ద్వితీయార్ధం మొత్తం వేరే నాయిక చుట్టూ తిరుగుతుందట. ఆ పాత్రలో నర్గిస్ ఫక్రీ కనిపించనుందని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`హరిహర వీరమల్లు`కి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



