కాజల్ పెళ్లి ఫస్ట్ ఫొటో వచ్చేసింది!
on Oct 30, 2020
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో శుక్రవారం రాత్రి ముంబైలో కన్నుల పండువగా జరిగింది. వధూవరుల మొట్టమొదటి పెళ్లి ఫొటో బయటికొచ్చింది. రోజ్ పింక్, ఎరుపు మిశ్రమ వర్ణం లెహెంగాలో కాజల్ గార్జియస్గా మెరిసిపోతోంది. ముక్కుకు పెద్ద రింగు, మెడలో హెవీ నెక్లెస్, పాపిడి బిళ్ల, నడుముకు వడ్డాణంతో సంప్రదాయ బద్ధమైన వధువు వేషధారణతో ఆకట్టుకుంది. ఇక గౌతమ్ తెల్లడి షేర్వాణీ, తలకు టర్బన్ ధరించి హుందాగా అవుపిస్తున్నాడు. ముంబైలోని కొలాబాలో ఉన్న ద తాజ్ మహల్ హోటల్లో వారి వివాహ వేడుక జరిగింది. పెళ్లి వేదికను గులాబీలు, ఆర్చిడ్లు, రకరకాల పూలతో అలంకరించారు.
కొంత కాలం క్రితం ఒక వ్యాపారవేత్తతో కాజల్ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ ప్రచారంలోకి వచ్చింది. ఏదేమైనా, అక్టోబర్ ఫస్ట్ వీక్లో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకోబోతున్నానని ప్రకటించింది కాజల్. గౌతమ్ ఒక ఇంటీరియర్ డిజైన్ వ్యాపారవేత్త. పెళ్లి వేడుకకు ముందు పసుపు కుంకుమ, గోరింటాకు వేడుకలకు సంబంధించిన ఫొటోలను కాజల్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసుకుంది.
Also Read