రియాలిటీ టీవీ స్టార్ బర్త్‌డే పార్టీ ఖర్చు 1 మిలియన్ డాలర్స్!
on Oct 30, 2020
అమెరికన్ మోడల్, నటి, రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ జరుపుకున్న అత్యంత ఖరీదైన 40వ బర్త్‌డేకి సంబంధించిన పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అయినా వాటిని ఆమె ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఓవైపు కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తుండగానే ఆమె తన బర్త్‌డే వేడుకలను ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఒక ప్రైవేట్ ఐలాండ్‌లో ఘనంగా జరుపుకుంది. వీటికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను ఆమె లేటెస్ట్గా షేర్ చేసింది.
బర్త్‌డే పార్టీకి ఆమె ఖర్చుపెట్టింది ఎంతో తెలుసా? అక్షరాలా 1 మిలియన్ డాలర్లు! రూపాయల్లో చెప్పాలంటే.. 7 కోట్ల 45 లక్షలు!! తన సిస్టర్స్‌తో, ఫ్రెండ్స్‌తో ఆమె హుషారుగా గెంతుతూ, ఎంజాయ్ చేస్తూ, ద బ్రాండో రిసార్ట్‌లో రాత్రిపూట సముద్రంలో చిందులేస్తూ గడిపిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకుంది. ఆ పిక్చర్లలో కిమ్‌తో పాటు ఆమె సోదరి కోర్ట్నీ కర్దాషియన్, ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్ స్టెఫానీ షెఫర్డ్, లాలా ఆంథోనీ కనిపిస్తున్నారు. ఆ ఫొటోలకు ఆమె "నైట్ స్విమ్" అనే క్యాప్షన్ జోడించింది.
అంతే కాదు, తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పలు వీడియోలను షేర్ చేసిన ఆమె వాటికి 'special surprise the last day of our trip,' అని పేరు పెట్టింది. బర్త్‌డే పార్టీ ఫొటోల్లో కనిపించని ఆమె భర్త కన్యే వెస్ట్ ఆ వీడియోల్లో దర్శనమిచ్చాడు.
Also Read