వర్మ కెరీర్ 'క్లైమాక్స్'కి వచ్చిందా?
on May 18, 2020
బళ్ళు ఓడలు కావడం ఓడలు బళ్ళు కావడం అంటే ఇదేనేమో! ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు బూతు సినిమాలు తీస్తుండడం ఆయనను అభిమానించే వారిలో కొందరికి నచ్చడం లేదు. పూలమ్మిన చోట కట్టెలు అమ్మినట్టు... మంచి మంచి సినిమాలు తీసి అమ్మిన వర్మ, ఇప్పుడు పోర్న్ స్టార్ బట్టలు తీసి చేసిన సన్నివేశాలను అమ్ముకుంటున్నారు.
ఇంటర్నేషనల్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'క్లైమాక్స్'. లాక్ డౌన్ లో వర్మ ఈ సినిమా తీశారో? అంతకుముందు తీశారో? ఇప్పుడు మాత్రం టీజర్, సాంగ్, ట్రైలర్ తో హడావిడి చేస్తున్నారు. రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేశారు. ఒక జంట సరదాగా ఎడారికి వెళుతే... అక్కడ కొందరు దుండగులు వాళ్ళ పై దాడి చేయడమే సినిమా కథాంశమని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దీన్ని మామూలుగా తీస్తే వర్మ ఎందుకు అవుతారు? మియా మాల్కోవాను సినిమాలో ప్రధాన పాత్ర తీసుకుని ఆమె చేత నగ్న ప్రదర్శన చేయించాడు. ట్రైలర్ చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ కెరీర్ 'క్లైమాక్స్'కి వచ్చిందా? అనే సందేహం కలుగుతోంది. వర్మ శృంగార పైత్యం పరాకాష్టకు చేరింది.
'శివ', 'సత్య', 'రంగీలా', 'సర్కార్' క్లాసిక్ సినిమాలు తీసిన వర్మ కెరీర్ పతనావస్థ మొదలై చాలాకాలం అయిందని ఆయన దగ్గర అ పని చేసిన అనురాగ్ కశ్యప్ వంటి దర్శకులు ఎప్పుడో కామెంట్ చేశారు. మియా మాల్కోవా 'జిఎస్టి', 'క్లైమాక్స్' వంటివి తీసుకుంటే ఆ మాటలు నిజం అనుకోవాల్సి వస్తోంది.
RGV climax trailer,ram gopal varma and mia malkova new film climax,ram gopal varma climax,climax trailer,RGV Climax Movie Official Trailer