హవ్వా... పవన్ ఓటమికి, 'సాహో'కి ముడి పెడతారా?
on Aug 31, 2019
.jpg)
"ప్రభాస్‌ది ఏ ఊరు? భీమవరం.
పవన్‌కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయింది ఎక్కడ? భీమవరం.
సుజిత్ ఎవరి ఫ్యాన్? పవన్ కల్యాణ్! ‘సాహో’ రివెంజ్ స్టోరీరా! నీకు అర్థం కావట్లేదా?" - 'సాహో' విడుదలై 24 గంటలు గడవక ముందే వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా సైట్లలో చక్కర్లు కొట్టిన సందేశమిది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుండి పోటీ చేసిన పవన్ కల్యాణ్ విజయం సాధించలేకపోయారు. భీమవరంలో పవన్ ఓటమికి కారణమిదే అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ, ప్రభాస్ వర్గీయులు కారణం అన్నట్టు కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. పవన్ ఓటమిని జీర్ణించుకోలేని సుజీత్, అదే ప్రాంతానికి చెందిన ప్రభాస్ అవకాశం ఇస్తే కావాలని ప్లాప్ సినిమా తీశాడని పోస్టులు పెడుతున్నారు. ఇవి చూసి నలుగురు నవ్వుతారు, తిడతారు అని కూడా ఆలోచించడం లేదు. 'సాహో' ఫలితాన్ని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడి చేతిలో 300 కోట్ల రూపాయల సినిమా పెడితే కావాలని ప్లాప్ తీస్తాడా? కావాలని చేస్తే అతడి కెరీర్ ఏమవుతుంది? తెలిసి తెలిసి జీవితాన్ని నట్టేట ముంచుకుంటాడా? ఇటువంటివేవీ ఆలోచించకుండా కొందరు చేసే కామెంట్స్ అనవసర గొడవలకు దారి తీస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



